Deuteronomy_13
ఒక ప్రవక్త గాని కలలు కనువాడు గాని లేచి సూచక క్రియను చేసి "వేరొక దేవతలను పూజింతము రండి" అని చెప్పిన యెడల నీవు _____? | అతని మాట వినవలెను | అతని మాట వినకూడదు | అతనిని అనుసరించవలెను | భయపడవలెను | అతని మాట వినకూడదు | ఆ ప్రవక్తయైనను కలలు కనువాడైనను చెప్పు మాటలను మీరు వినకూడదు. -- ద్వితీయోపదేశకాండము 13:3.
అట్టి ప్రవక్తను లేదా కలలు కనువానిని ఏమి చేయవలెను? | వెలివేయవలెను | చంపవలెను (మరణశిక్ష విధింపవలెను) | చెరసాలలో వేయవలెను | క్షమించవలెను | చంపవలెను (మరణశిక్ష విధింపవలెను) | ఆ ప్రవక్తకేమి కలలు కనువానికేమి మరణశిక్ష విధింపవలెను. -- ద్వితీయోపదేశకాండము 13:5.
నీ సహోదరుడైనను, నీ కుమారుడైనను, నీ భార్యయైనను రహస్యముగా "ఇతర దేవతలను పూజింతము రండి" అని నిన్ను ప్రేరేపించిన యెడల నీవు ఏమి చేయవలెను? | వారిని దాచవలెను | వారిని చంపవలెను (రాళ్లతో కొట్టవలెను) | వారిని విడిచిపెట్టవలెను | వారి మాట వినవలెను | వారిని చంపవలెను (రాళ్లతో కొట్టవలెను) | నీవు ఒప్పుకొనకూడదు, వినకూడదు, కటాక్షంపకూడదు, జాలిపడకూడదు, వానిని దాచకూడదు; నిశ్చయముగా వానిని చంపవలెను. -- ద్వితీయోపదేశకాండము 13:8-9.
ఒక పట్టణములోని వారు ఇతర దేవతలను పూజించుటకు జనులను ప్రేరేపించిన యెడల ఆ పట్టణమును ఏమి చేయవలెను? | పన్ను వేయవలెను | కత్తి వాతను హతము చేసి సర్వనాశనము చేయవలెను | విడిచిపెట్టవలెను | కాల్చకూడదు | కత్తి వాతను హతము చేసి సర్వనాశనము చేయవలెను | ఆ పట్టణపు నివాసులను కత్తి వాతను హతము చేసి, దానిని అందులోని సమస్తమును సర్వనాశనము (Devoted/Curse) చేయవలెను. -- ద్వితీయోపదేశకాండము 13:15.
Comments
Post a Comment