Deuteronomy_18

నీ దేవుడైన యెహోవాకు ఏదైనను లోపము గల ఎద్దునైనను గొర్రెనైనను అర్పించకూడదు, అది ఆయనకు _____? | ఇష్టము కాదు | హేయము (Abomination) | తక్కువైనది | అపవిత్రము | హేయము (Abomination) | అది నీ దేవుడైన యెహోవాకు హేయము గదా. -- ద్వితీయోపదేశకాండము 17:1.

ఎవరైనా అన్యుల దేవతలను పూజించిన యెడల వారిని ఎక్కడ రాళ్లతో కొట్టి చంపవలెను? | వారి ఇంట | దేవాలయములో | నీ పుర ద్వారముల యొద్ద | అరణ్యములో | నీ పుర ద్వారముల యొద్ద | ఆ పురుషునినే గాని ఆ స్త్రీనినే గాని నీ పుర ద్వారముల యొద్దకు (Gates) తీసుకొనివచ్చి రాళ్లతో కొట్టి చంపవలెను. -- ద్వితీయోపదేశకాండము 17:5.

మరణశిక్ష విధించుటకు ఎంతమంది సాక్షులు ఉండవలెను? | ఒక్కరు | పదిమంది | ఇద్దరు లేక ముగ్గురు | ఐదుగురు | ఇద్దరు లేక ముగ్గురు | ఇద్దరు సాక్షుల నోటి మాట చేతనే గాని, ముగ్గురు సాక్షుల నోటి మాట చేతనే గాని చంపవలెను. -- ద్వితీయోపదేశకాండము 17:6.

తీర్పు తీర్చుటకు ఏదైనా సంగతి నీకు కఠినముగా ఉంటే నీవు ఎవరి యొద్దకు వెళ్ళవలెను? | రాజు యొద్దకు | యాజకుల యొద్దకును న్యాయాధిపతి యొద్దకును | ప్రవక్త యొద్దకు | పెద్దల యొద్దకు | యాజకుల యొద్దకును న్యాయాధిపతి యొద్దకును | లేవీయులైన యాజకుల యొద్దకును ఆ కాలమందు ఉండు న్యాయాధిపతి యొద్దకును వెళ్ళి విచారింపవలెను. -- ద్వితీయోపదేశకాండము 17:8-9.

ఇశ్రాయేలీయుల మీద రాజును నియమించుకొనవలెనని అనుకున్నప్పుడు, ఎవరిని రాజుగా నియమించుకొనకూడదు? | నీ సహోదరుని | అన్యుని (Stranger) | పెద్ద వానిని | ధనవంతుని | అన్యుని (Stranger) | నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. -- ద్వితీయోపదేశకాండము 17:15.

రాజు తన కొరకు వేటిని విస్తారముగా సంపాదించుకొనకూడదు? | గుర్రములను, భార్యలను, వెండి బంగారములను | ఇళ్లను | భూములను | దాసులను | గుర్రములను, భార్యలను, వెండి బంగారములను | అతడు తన కొరకు గుర్రములను... అనేకమంది భార్యలను... వెండి బంగారములను విస్తారముగా సంపాదించుకొనకూడదు. -- ద్వితీయోపదేశకాండము 17:16-17.

రాజు సింహాసనము మీద ఆసీనుడైనప్పుడు అతడు తన కొరకు ఏమి చేసికొనవలెను? | విగ్రహమును | పెద్ద ఇల్లును | ధర్మశాస్త్ర గ్రంథమును చూసి వ్రాసికొనవలెను | కిరీటమును | ధర్మశాస్త్ర గ్రంథమును చూసి వ్రాసికొనవలెను | యాజకుల స్వాధీనములో నున్న గ్రంథమును చూసి ఆ ధర్మశాస్త్రము యొక్క ప్రతిని (Copy) తన కొరకు వ్రాసికొనవలెను. -- ద్వితీయోపదేశకాండము 17:18.

Comments

Popular posts from this blog

Genesis_1