Deuteronomy_20
నీవు యుద్ధమునకు వెళ్ళునప్పుడు గుర్రములను రథములను గొప్ప సమూహమును చూసి _____? | పారిపోవలెను | భయపడకూడదు | లొంగిపోవలెను | దాక్కోవలెను | భయపడకూడదు | వారికి భయపడకూడదు; ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు. -- ద్వితీయోపదేశకాండము 20:1.
యుద్ధమునకు వెళ్ళునప్పుడు ప్రజలతో ఎవరు మాట్లాడవలెను? | రాజు | సేనాధిపతి | యాజకుడు | ప్రవక్త | యాజకుడు | యుద్ధమునకు దగ్గరైనప్పుడు యాజకుడు వచ్చి ప్రజలతో మాట్లాడవలెను. -- ద్వితీయోపదేశకాండము 20:2.
క్రొత్త ఇల్లు కట్టుకొని దానిని ప్రతిష్ఠించని వాడు ఉంటే అతడు ఎక్కడికి వెళ్ళవలెను? | యుద్ధమునకు | తన ఇంటికి | దేవాలయమునకు | పొలమునకు | తన ఇంటికి | వాడు యుద్ధములో చనిపోయిన యెడల మరియొకడు దానిని ప్రతిష్ఠించునేమో గనుక వాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవలెను. -- ద్వితీయోపదేశకాండము 20:5.
ఎవరు యుద్ధమునకు వెళ్ళకూడదు? | ద్రాక్షతోట నాటి పండ్లు తినని వాడు | స్త్రీని ప్రధానము చేసికొని పెండ్లి చేసికొనని వాడు | భయపడి మెత్తని గుండె గలవాడు | పైవారందరూ | పైవారందరూ | ఈ కారణముల వలన వారు తమ ఇండ్లకు తిరిగి వెళ్ళవలెను. -- ద్వితీయోపదేశకాండము 20:5-8.
నీవు ఒక పురము మీద యుద్ధము చేయుటకు సమీపించినప్పుడు ముందుగా ఏమి చేయవలెను? | బాణములు వేయవలెను | సమాధానపు మాటలు (Peace) ప్రకటించవలెను | ముట్టడి వేయవలెను | నిప్పు పెట్టవలెను | సమాధానపు మాటలు (Peace) ప్రకటించవలెను | నీవు దానితో సమాధానపు మాటలు ఆడవలెను. -- ద్వితీయోపదేశకాండము 20:10.
వారు సమాధానమునకు ఒప్పుకొనిన యెడల వారు నీకు ఏమవుదురు? | స్నేహితులు | పన్ను కట్టు దాసులు | శత్రువులు | సమానులు | పన్ను కట్టు దాసులు | అందులోని జనులందరూ నీకు పన్ను కట్టి నిన్ను సేవింపవలెను. -- ద్వితీయోపదేశకాండము 20:11.
దేవుడు నీకు అప్పగించిన పురములలో దేనిని బ్రతుకనియ్యకూడదు? | పశువులను | ఊపిరి గల దేనిని | చెట్లను | రాళ్లను | ఊపిరి గల దేనిని | ఊపిరి గల దేనిని బ్రతుకనియ్యకూడదు. -- ద్వితీయోపదేశకాండము 20:16.
నీవు పట్టణమును ముట్టడి వేసినప్పుడు గొడ్డలితో వేటిని పాడుచేయకూడదు? | గోడలను | ఇళ్లను | పలవృక్షములను (Trees for meat) | రాళ్లను | పలవృక్షములను (Trees for meat) | నీవు తినదగిన చెట్లను గొడ్డలితో నరికి పాడుచేయకూడదు; పొలములోని చెట్లు మనుష్యులా? -- ద్వితీయోపదేశకాండము 20:19.
Comments
Post a Comment