Deuteronomy_4
నేను మీకు ఆజ్ఞాపించు మాటకు మీరు దేనిని _____ కూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. | కలుప | వ్రాయ | చదవ | బోధించ | కలుప | నేను మీకు ఆజ్ఞాపించు మాటకు మీరు దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. -- ద్వితీయోపదేశకాండము 4:2.
ఏ విషయములో యెహోవా చేసిన పనిని మీ కన్నులు చూచెను? | నీళ్ల విషయములో | మన్న విషయములో | బయల్పెయోరు విషయములో | యుద్ధ విషయములో | బయల్పెయోరు విషయములో | బయల్పెయోరు విషయములో యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి గదా. -- ద్వితీయోపదేశకాండము 4:3.
అన్యజనుల దృష్టికి ఏది మీకు జ్ఞానమును వివేకమునై ఉన్నది? | మీ సంపద | మీ బలము | ఈ కట్టడలను గైకొని నడుచుకొనుట | మీ సంఖ్య | ఈ కట్టడలను గైకొని నడుచుకొనుట | ఈ కట్టడలను గైకొని నడుచుకొనుడి; అన్యజనుల దృష్టికి అదే మీకు జ్ఞానమును వివేకమునై ఉండును. -- ద్వితీయోపదేశకాండము 4:6.
హోరేబు కొండలో అగ్ని జ్వాలల మధ్య నుండి దేవుడు మాట్లాడినప్పుడు మీరు దేనిని చూడలేదు? | అగ్నిని | పొగను | ఏ స్వరూపమును (Similitude) | వెలుగును | ఏ స్వరూపమును (Similitude) | మీరు మాటల ధ్వనిని వింటిరి గాని మీరు ఏ స్వరూపమును చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. -- ద్వితీయోపదేశకాండము 4:12.
దేవుడు మిమ్మును ఐగుప్తు అను ఎట్టి కొలిమిలో నుండి రప్పించెను? | బంగారు కొలిమి | ఇనుప కొలిమి | మట్టి కొలిమి | అగ్ని కొలిమి | ఇనుప కొలిమి | ఐగుప్తు అను ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించిరి. -- ద్వితీయోపదేశకాండము 4:20.
నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు, _____ దేవుడునై ఉన్నాడు. | ప్రేమించు | రోషము గల (Jealous) | శాంతము గల | న్యాయము గల | రోషము గల (Jealous) | నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు, రోషము గల దేవుడునై ఉన్నాడు. -- ద్వితీయోపదేశకాండము 4:24.
మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మతోను వెదకిన యెడల దేవుడు మీకు _____? | దూరమగును | దొరుకును | శిక్షించును | దాగుకొనును | దొరుకును | మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మతోను ఆయనను వెదకిన యెడల ఆయన మీకు దొరుకును. -- ద్వితీయోపదేశకాండము 4:29.
నరహంతకుడు పారిపోవుటకు మోషే యొర్దాను ఇవతల ఎన్ని పురములను ప్రత్యేకించెను? | 6 | 3 | 12 | 48 | 3 | అప్పుడు మోషే సూర్యోదయ దిక్కున యొర్దాను ఇవతల మూడు పురములను ప్రత్యేకించెను. -- ద్వితీయోపదేశకాండము 4:41.
రూబేనీయులకు ఇయ్యబడిన ఆశ్రయపురము ఏది? | రామోతు | గోలాను | బెసెరు | హెబ్రోను | బెసెరు | మైదానపు దేశమందలి అరణ్యములో నున్న బెసెరు రూబేనీయులకు నియమింపబడెను. -- ద్వితీయోపదేశకాండము 4:43.
Comments
Post a Comment