Deuteronomy_7

దేవుడు కనానులో నుండి నీ కంటె బలము గల ఎన్ని జనములను వెళ్ళగొట్టును? | 12 | 3 | 7 | 10 | 7 | హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను ఏడు జనములను వెళ్ళగొట్టును. -- ద్వితీయోపదేశకాండము 7:1.

నీవు వారితో వియ్యమందకూడదు, నీ కుమార్తెను వారి కుమారునికి _____? | ఇయ్యవలెను | స్నేహము చేయవలెను | ఇయ్యకూడదు | అమ్మవలెను | ఇయ్యకూడదు | నీవు వారితో వియ్యమందకూడదు, నీ కుమార్తెను వాని కుమారునికి ఇయ్యకూడదు. -- ద్వితీయోపదేశకాండము 7:3.

నీవు వారి బలిపీఠములను పడగొట్టి, వారి పోత విగ్రహములను దేనితో కాల్చవలెను? | అగ్నితో | నూనెతో | నీళ్లతో | రాళ్లతో | అగ్నితో | వారి బలిపీఠములను పడగొట్టి... వారి పోత విగ్రహములను అగ్నితో కాల్చవలెను. -- ద్వితీయోపదేశకాండము 7:5.

భూమి మీద నున్న సమస్త జనములలో యెహోవా నిన్ను ఎట్టి జనముగా ఉండుటకు ఏర్పరచుకొనెను? | పెద్ద జనముగా | స్వకీయ జనముగా (A special people) | ధనవంతులుగా | సామాన్యులుగా | స్వకీయ జనముగా (A special people) | నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము... తనకు స్వకీయ జనముగా ఉండుటకు నిన్ను ఏర్పరచుకొనెను. -- ద్వితీయోపదేశకాండము 7:6.

యెహోవా మిమ్మును ఎందుకు ఏర్పరచుకొనెను? | మీరు విస్తారమైన జనమని | మీరు నీతిమంతులని | ఆయన మిమ్మును ప్రేమించుట బట్టి | మీరు బలవంతులని | ఆయన మిమ్మును ప్రేమించుట బట్టి | మీరు విస్తారమైన జనమని యెహోవా మిమ్మును ప్రేమించి ఏర్పరచుకొనలేదు... యెహోవా మిమ్మును ప్రేమించుట బట్టి... మిమ్మును రప్పించెను. -- ద్వితీయోపదేశకాండము 7:7-8.

దేవుడు తన్ను ప్రేమించుచు తన ఆజ్ఞలను గైకొనువారి పట్ల ఎన్ని తరముల వరకు నిబంధనను నెరవేర్చును? | 100 | 1000 | 7 | 40 | 1000 | వెయ్యి తరముల వరకు నిబంధనను కృపను జ్ఞాపకము చేసికొనువాడు. -- ద్వితీయోపదేశకాండము 7:9.

నీవు ఆ జనములకు భయపడకూడదు, ఏలయనగా? | నీకు ఆయుధములు కలవు | మహాతీయు భయంకరుడునైన నీ దేవుడు నీ మధ్య ఉన్నాడు | వారు బలహీనులు | నీకు కోటలు కలవు | మహాతీయు భయంకరుడునైన నీ దేవుడు నీ మధ్య ఉన్నాడు | నీవు వారికి భయపడకూడదు; నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన మహాతీయు భయంకరుడునైన దేవుడు. -- ద్వితీయోపదేశకాండము 7:21.

నీవు వారి దేవతల ప్రతిమలను అగ్నితో కాల్చవలెను, వాటి మీద నున్న వేటిని ఆశింపకూడదు? | వెండి బంగారములను | వస్త్రములను | రంగులను | ఆభరణములను | వెండి బంగారములను | వాటి మీద నున్న వెండి బంగారములను ఆశింపకూడదు, వాటిని తీసుకొనకూడదు. -- ద్వితీయోపదేశకాండము 7:25.

హేయమైన దానిని (విగ్రహమును) నీ యింటికి తేకూడదు, తెచ్చిన యెడల నీవును దాని వలె _____? | ధనవంతుడవు అవుదువు | శాపగ్రస్తుడవు అవుదువు | గొప్పవాడవు అవుదువు | రోగివి అవుదువు | శాపగ్రస్తుడవు అవుదువు | నీవును దాని వలె శాపగ్రస్తుడవు కాకుండునట్లు, ఏ హేయమైన దానిని నీ యింటికి తేకూడదు. -- ద్వితీయోపదేశకాండము 7:26.

Comments

Popular posts from this blog

Genesis_1