Genesis_28

యాకోబు ఎక్కడికి పారిపొమ్మని అతని తల్లి చెప్పెను?|ఐగుప్తు|హారానులో ఉన్న లాబాను యొద్దకు|గెరారు|సోదోమ|హారానులో ఉన్న లాబాను యొద్దకు|నీవు లేచి పద్దనరాములోని నీ తల్లి తండ్రియైన బేతూయేలు ఇంటికి వెళ్లి నీ మేనమామయైన లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొనుము (ఆది 28:2)

యాకోబు నిద్రపోతున్నప్పుడు కలలో భూమి మీద నుండి ఆకాశము వరకు దేనిని చూశాడు?|ఒక చెట్టు|ఒక నిచ్చెన|ఒక గోపురం|ఒక పక్షి|ఒక నిచ్చెన|అతడొక కల కనెను; అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను (ఆది 28:12)

నిచ్చెన మీద ఎవరు ఎక్కుచు దిగుచు ఉండిరి?|నరులు|దేవుని దూతలు|పక్షులు|రాజులు|దేవుని దూతలు|దేవుని దూతలు దానిమీద ఎక్కుచు దిగుచు ఉండిరి (ఆది 28:12)

నిద్ర మేల్కొన్న తర్వాత యాకోబు ఆ స్థలమును ఏమని పిలిచెను?|బాబెలు|బేతేలు|యెరూషలేము|బేయేర్షెబా|బేతేలు|నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు... ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు అని దానికి బేతేలు అని పేరు పెట్టెను (ఆది 28:17-19)

యాకోబు తలకింద పెట్టుకున్న రాయిని తీసి దేనిని పోసి ప్రతిష్ఠించాడు?|నీరు|నూనె|రక్తము|పాలు|నూనె|యాకోబు తాను తలకింద పెట్టుకొనిన రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను (ఆది 28:18)

Comments

Popular posts from this blog

Genesis_1