Joshua_18

ఇశ్రాయేలీయులు ప్రత్యక్షపు గుడారమును (Tabernacle) ఎక్కడ వేసిరి? | గిల్గాలులో | యెరూషలేములో | షీలోహులో | బేతేలులో | షీలోహులో | ఇశ్రాయేలీయుల సర్వసమాజము షీలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారమును వేసిరి. -- యెహోషువ 18:1.

అప్పటికి ఇంక ఎంతమందికి స్వాస్థ్యము పంచిపెట్టబడలేదు? | 12 గోత్రములకు | 7 గోత్రములకు | 3 గోత్రములకు | 5 గోత్రములకు | 7 గోత్రములకు | తమ స్వాస్థ్యములను ఇంకను పొందని ఏడు గోత్రములు ఇశ్రాయేలీయులలో ఉండెను. -- యెహోషువ 18:2.

దేశమును చూసి వచ్చుటకు ప్రతి గోత్రము నుండి ఎంతమందిని పంపవలెనని యెహోషువ చెప్పెను? | ఒక్కొక్కని | ముగ్గురిని | పదిమందిని | ఏడుగురిని | ముగ్గురిని | ప్రతి గోత్రమునకు ముగ్గురు మనుష్యులను నాయొద్దకు రప్పించుడి; వారిని పంపెదను. -- యెహోషువ 18:4.

ఆ మనుష్యులు వెళ్లి దేశమును ఏడు భాగములుగా చేసి ఎందులో వ్రాసిరి? | రాతి మీద | పుస్తకములో | బట్ట మీద | నేల మీద | పుస్తకములో | వారు ఆ దేశ సంచారము చేసి, దానిని ఏడు భాగములుగా ఒక పుస్తకములో వ్రాసి... యెహోషువ యొద్దకు వచ్చిరి. -- యెహోషువ 18:9.

యెహోషువ ఎక్కడ వారి కొరకు యెహోవా సన్నిధిని చీట్లు వేసెను? | గిల్గాలులో | షీలోహులో | హెబ్రోనులో | యెరికోలో | షీలోహులో | యెహోషువ షీలోహులో యెహోవా సన్నిధిని వారి కొరకు చీట్లు వేసెను. -- యెహోషువ 18:10.

బెన్యామీను గోత్రము యొక్క సరిహద్దు వేటి మధ్య వచ్చెను? | యూదా, దాను | యూదా, యోసేపు (ఎఫ్రాయిము) | రూబేను, గాదు | ఆషేరు, నఫ్తాలి | యూదా, యోసేపు (ఎఫ్రాయిము) | వారి చీటి యూదా వంశస్థులకును యోసేపు వంశస్థులకును మధ్య వచ్చెను. -- యెహోషువ 18:11.

బెన్యామీను గోత్రమునకు వచ్చిన పట్టణములలో యెబూసీ అనగా ఏది? | యెరికో | యెరూషలేము | బేతేలు | గిబియోను | యెరూషలేము | యెబూసీ అనగా యెరూషలేము. -- యెహోషువ 18:28.

Comments

Popular posts from this blog

Genesis_1