Joshua_19

షిమ్యోను గోత్రము యొక్క స్వాస్థ్యము ఎవరి స్వాస్థ్యము నడుమ ఉండెను? | ఎఫ్రాయిము | యూదా | బెన్యామీను | మనష్షే | యూదా | వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము నడుమ ఉండెను. -- యెహోషువ 19:1.

షిమ్యోను వారికి యూదా వంతులో నుండి ఎందుకు ఇచ్చిరి? | యూదా వారు అడిగిరి గనుక | యూదా వారికి వంతు ఎక్కువాయెను గనుక | చీటి పడలేదు గనుక | దేవుడు చెప్పెను గనుక | యూదా వారికి వంతు ఎక్కువాయెను గనుక | యూదా వంశస్థుల వంతు వారికి ఎక్కువాయెను గనుక షిమ్యోను వంశస్థులు వారి స్వాస్థ్యము నడుమ స్వాస్థ్యమును పొందిరి. -- యెహోషువ 19:9.

దాను గోత్రము యొక్క సరిహద్దు వారికి చాలకపోయినప్పుడు వారు ఏ ఊరి మీదికి యుద్ధము చేసిరి? | యెరికో | లెషెము (లాయిషు) | గెజెరు | ఎక్రోను | లెషెము (లాయిషు) | దాను వంశస్థులు లెషెము మీదికి వెళ్లి దానితో యుద్ధము చేసి దాన్ని పట్టుకొనిరి. -- యెహోషువ 19:47.

వారు లెషెమును పట్టుకొని దానికి తమ పితరుడైన దాను బట్టి ఏమని పేరు పెట్టిరి? | గిల్గాలు | దాను | బేతేలు | హెబ్రోను | దాను | తమ పితరుడైన దాను పేరును బట్టి లెషెమునకు దాను అని పేరు పెట్టిరి. -- యెహోషువ 19:47.

ఇశ్రాయేలీయులు దేశమును పంచుట ముగించిన తరువాత వారు ఎవరికి స్వాస్థ్యము ఇచ్చిరి? | కాలేబుకు | యెహోషువకు | ఎలియాజరుకు | ఫీనెహాసును | యెహోషువకు | దేశమును పంచిపెట్టుట ముగించిన తరువాత ఇశ్రాయేలీయులు తమ మధ్య నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమును ఇచ్చిరి. -- యెహోషువ 19:49.

యెహోషువ అడిగిన ఏ పట్టణమును వారు అతనికి ఇచ్చిరి? | షీలోహు | తిమ్నత్సెరహు | హెబ్రోను | గిల్గాలు | తిమ్నత్సెరహు | అతడు అడిగిన తిమ్నత్సెరహు అను పట్టణమును అతనికి ఇచ్చిరి; అది ఎఫ్రాయిము మన్నెములో ఉన్నది. -- యెహోషువ 19:50.

Comments

Popular posts from this blog

Genesis_1