Joshua_20
పొరపాటున ఒకని చంపిన వాడు పారిపోవుటకు వేటిని ఏర్పరచుకొనవలెను? | కోటలను | ఆశ్రయపురములను | గుహలను | గుడారములను | ఆశ్రయపురములను | మీరు ఆశ్రయపురములను ఏర్పరచుకొనుడి. -- యెహోషువ 20:2.
అతడు ఎవరికి భయపడి అక్కడికి పారిపోవలెను? | రాజుకు | రక్తగ్రాహికి (Avenger of blood) | యాజకునికి | సైనికులకు | రక్తగ్రాహికి (Avenger of blood) | అవి రక్తగ్రాహి చేతిలో పడకుండా మీకు ఆశ్రయముగా ఉండును. -- యెహోషువ 20:3.
పారిపోయి వచ్చిన వాడు ఆ పుర ద్వారము నొద్ద నిలిచి ఎవరికి తన సంగతి చెప్పవలెను? | యాజకులకు | ఆ పురపు పెద్దలకు | కావలివారికి | రాజుకు | ఆ పురపు పెద్దలకు | ఆ పురములలో ఒకదానికి పారిపోయి... ఆ పురపు పెద్దలకు తన సంగతి వినిపింపవలెను. -- యెహోషువ 20:4.
అతడు ఎంత కాలము ఆ పురములో నివసించవలెను? | 7 సంవత్సరములు | సమాజము ఎదుట తీర్పు పొందు వరకు / ప్రధానయాజకుడు మృతి బొందు వరకు | 40 సంవత్సరములు | శత్రువు వెళ్ళిపోవు వరకు | సమాజము ఎదుట తీర్పు పొందు వరకు / ప్రధానయాజకుడు మృతి బొందు వరకు | అతడు తీర్పు పొందుటకై సమాజము ఎదుట నిలుచు వరకు, లేక అప్పుడున్న ప్రధానయాజకుడు మృతి బొందు వరకు ఆ పురములో నివసింపవలెను. -- యెహోషువ 20:6.
గలిలయలో (నఫ్తాలిలో) ఉన్న ఆశ్రయపురము ఏది? | షెకెము | కెదెషు | హెబ్రోను | బెసెరు | కెదెషు | నఫ్తాలి కొండ ప్రదేశమందలి గలిలయలో కెదెషును (Kedesh)... ప్రతిష్ఠించిరి. -- యెహోషువ 20:7.
ఎఫ్రాయిము కొండ ప్రదేశములో ఉన్న ఆశ్రయపురము ఏది? | షెకెము | రామోతు | గోలాను | కెదెషు | షెకెము | ఎఫ్రాయిము కొండ ప్రదేశమందలి షెకెమును (Shechem)... ప్రతిష్ఠించిరి. -- యెహోషువ 20:7.
యూదా కొండ ప్రదేశములో ఉన్న ఆశ్రయపురము ఏది? | బెసెరు | కిర్యతర్బా (హెబ్రోను) | షెకెము | రామోతు | కిర్యతర్బా (హెబ్రోను) | యూదా కొండ ప్రదేశమందలి హెబ్రోను అనబడిన కిర్యతర్బాను (Kirjatharba) ప్రతిష్ఠించిరి. -- యెహోషువ 20:7.
యొర్దాను అవతల రూబేను గోత్రములో ఉన్న ఆశ్రయపురము ఏది? | బెసెరు | రామోతు | గోలాను | కెదెషు | బెసెరు | రూబేను గోత్రములోని మైదానమందున్న బెసెరును (Bezer)... నియమించిరి. -- యెహోషువ 20:8.
గాదు గోత్రములో (గిలాదులో) ఉన్న ఆశ్రయపురము ఏది? | బెసెరు | రామోతు | షెకెము | హెబ్రోను | రామోతు | గాదు గోత్రములోని గిలాదులో నున్న రామోతును (Ramoth)... నియమించిరి. -- యెహోషువ 20:8.
మనష్షే గోత్రములో (బాషానులో) ఉన్న ఆశ్రయపురము ఏది? | కెదెషు | గోలాను | బెసెరు | హెబ్రోను | గోలాను | మనష్షే గోత్రములోని బాషానులో నున్న గోలానును (Golan) నియమించిరి. -- యెహోషువ 20:8.
Comments
Post a Comment