Joshua_3

జనులు యొర్దాను నదిని దాటకముందు అక్కడ ఎన్ని దినములు నిలిచిరి? | ఏడు దినములు | మూడు దినములు | ఒక దినము | పది దినములు | మూడు దినములు | మూడు దినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు... జనులకు ఆజ్ఞాపించిరి. -- యెహోషువ 3:2.

మీరు దేనిని చూచినప్పుడు మీ స్థలము నుండి బయలుదేరవలెను? | మేఘమును | నిబంధన మందసమును | మోషేను | బూర ధ్వనిని | నిబంధన మందసమును | యాజకులు మోయుచున్న మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును మీరు చూడగానే... సాగవలెను. -- యెహోషువ 3:3.

మీకును మందసమునకును మధ్య ఎంత ఎడము (Distance) ఉండవలెను? | 1000 మూరలు | 2000 మూరలు | 500 మూరలు | 100 మూరలు | 2000 మూరలు | మీకును దానికిని ఇంచుమించు రెండువేల మూరల ఎడము ఉండవలెను. -- యెహోషువ 3:4.

రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు _____? | సిద్ధపరచుకొనుడి | పరిశుద్ధపరచుకొనుడి | దాచుకొనుడి | కాపాడుకొనుడి | పరిశుద్ధపరచుకొనుడి | రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. -- యెహోషువ 3:5.

సర్వలోక నాధుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాలు యొర్దాను నీళ్లను ముట్టగానే ఏమవును? | నీళ్లు ఎండిపోవును | పైనుండి పారు నీళ్లు ఆగిపోవును | నీళ్లు రక్తంగా మారును | నీళ్లు పొంగును | పైనుండి పారు నీళ్లు ఆగిపోవును | పైనుండి పారు నీళ్లు ఆగిపోయి ఒక రాశిగా నిలుచును. -- యెహోషువ 3:13.

యొర్దాను నది ఎప్పుడు గట్టులన్నిటి మీద పొర్లి పారును? | వర్షాకాలమంతయు | కోతకాలమంతయు (Harvest time) | ఎండాకాలమంతయు | చలికాలమంతయు | కోతకాలమంతయు (Harvest time) | కోతకాలమంతయు యొర్దాను తన గట్టులన్నిటి మీద పొర్లి పారును. -- యెహోషువ 3:15.

నీళ్లు ఆదామునకు దగ్గరగా నున్న ఏ ఊరి యొద్ద ఏకరాశిగా నిలిచెను? | యెరికో | జారతాను | గిల్గాలు | షిత్తీము | జారతాను | ఆ నీళ్లు బహు దూరమున జారతాను ప్రాంతములో నున్న ఆదాము అను ఊరి యొద్ద ఏకరాశిగా నిలిచెను. -- యెహోషువ 3:16.

Comments

Popular posts from this blog

Genesis_1