Leviticus_1

యెహోవా మోషేను ఎక్కడి నుండి పిలిచి మాట్లాడాడు?|సీనాయి పర్వతం|ప్రత్యక్షపు గుడారము|ఐగుప్తు|మిద్యాను|ప్రత్యక్షపు గుడారము|యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనితో ఇట్లనెను. (లేవీయకాండము 1:1)

ఒకడు పశువులలో దహనబలి అర్పించాలనుకుంటే, ఎటువంటి పశువును అర్పించాలి?|ముసలిది|రోగిష్టిది|నిర్దోషమైన మగ పశువు|ఏదైనా పర్వాలేదు|నిర్దోషమైన మగ పశువు|అతడు అర్పించునది పశువులలోని దహనబలియైనయెడల నిర్దోషమైన మగదానిని అర్పించవలెను. (లేవీయకాండము 1:3)

బలి అర్పించే వ్యక్తి తన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు పశువు యొక్క ఏ భాగము మీద తన చెయ్యి ఉంచాలి?|తోక మీద|కాళ్ల మీద|తల మీద|రొమ్ము మీద|తల మీద|అతడు దహనబలి పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను; అతని కొరకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అంగీకరింపబడును. (లేవీయకాండము 1:4)

దహనబలి పశువును ఎక్కడ వధించాలి?|గుడారము లోపల|యెహోవా సన్నిధిని బలిపీఠము యొక్క ఉత్తర దిక్కున|అరణ్యములో|ఊరి వెలుపల|యెహోవా సన్నిధిని బలిపీఠము యొక్క ఉత్తర దిక్కున|యెహోవా సన్నిధిని బలిపీఠము యొక్క ఉత్తర దిక్కున దానిని వధింపవలెను. (లేవీయకాండము 1:11)

పశువును వధించిన తర్వాత యాజకులు దాని రక్తమును ఎక్కడ ప్రోక్షించాలి?|నేల మీద|బలిపీఠము చుట్టూ|గుడారము బయట|ప్రజల మీద|బలిపీఠము చుట్టూ|అహరోను కుమారులైన యాజకులు ఆ రక్తమును తెచ్చి బలిపీఠము చుట్టూ ప్రోక్షింపవలెను. (లేవీయకాండము 1:5, 11)

పశువును ముక్కలుగా కోసిన తర్వాత, యాజకులు వేటిని నీళ్లతో కడగాలి?|కేవలం తల|చర్మము|అంతరవయవములను కాళ్లను|దేనినీ కడగనక్కర్లేదు|అంతరవయవములను కాళ్లను|అతడు దాని అంతరవయవములను కాళ్లను నీళ్లతో కడుగవలెను; అప్పుడు యాజకుడు వాటన్నిటిని బలిపీఠము మీద దహింపవలెను. (లేవీయకాండము 1:9, 13)

గొర్రెలలో గాని మేకలలో గాని దహనబలి అర్పించేటప్పుడు అది ఎటువంటిదై ఉండాలి?|ఆడది|నిర్దోషమైన మగది|ముసలిది|నల్లనిది|నిర్దోషమైన మగది|అతడు గొర్రెలలో నుండి గాని మేకలలో నుండి గాని దహనబలి అర్పించునయెడల నిర్దోషమైన మగదానిని అర్పించవలెను. (లేవీయకాండము 1:10)

పక్షులలో దహనబలి అర్పించునప్పుడు వేటిని అర్పించవచ్చు?|కాకులు|గువ్వలు లేదా పావురపు పిల్లలు|హంసలు|కోళ్లు|గువ్వలు లేదా పావురపు పిల్లలు|అతడు పక్షులలో దహనబలి అర్పించునయెడల గువ్వలను గాని పావురపు పిల్లలను గాని అర్పించవలెను. (లేవీయకాండము 1:14)

పక్షిని బలి అర్పించేటప్పుడు యాజకుడు దాని రక్తమును ఎక్కడ పిండాలి?|పాత్రలో|నేల మీద|బలిపీఠము ప్రక్కన|గుడారము పైన|బలిపీఠము ప్రక్కన|యాజకుడు దానిని బలిపీఠమునొద్దకు తెచ్చి దాని తల త్రుంచి బలిపీఠము మీద దహించి దాని రక్తమును బలిపీఠము ప్రక్కన పిండవలెను. (లేవీయకాండము 1:15)

యెహోవాకు హోమముగా అర్పించబడే దహనబలి ఎటువంటి వాసననిస్తుంది?|సాధారణ వాసన|దుర్వాసన|ఇంపైన సువాసన|వాసన ఉండదు|ఇంపైన సువాసన|అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. (లేవీయకాండము 1:17)

Comments

Popular posts from this blog

Genesis_1