Numbers_13

కనాను దేశమును సంచరించి చూచుటకు ప్రతి గోత్రము నుండి ఎట్టి వారిని పంపవలెను? | యాజకులను | ప్రధానుడగు ఒక్కొక్క మనుష్యుని | యవ్వనస్తులను | వృద్ధులను | ప్రధానుడగు ఒక్కొక్క మనుష్యుని | వారి పితరుల గోత్రములలో ప్రధానుడగు ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను. -- సంఖ్యాకాండము 13:2.

నూను కుమారుడైన హోషేయకు మోషే ఏమని పేరు పెట్టెను? | కాలేబు | యెహోషువ | గిద్యోను | దావీదు | యెహోషువ | నూను కుమారుడైన హోషేయకు మోషే యెహోషువ అని పేరు పెట్టెను. -- సంఖ్యాకాండము 13:16.

మోషే వేగులవారితో దేశము సారమైనదో నిస్సారమైనదో, అందులో _____ ఉన్నవో లేవో కనిపెట్టుడి అనెను? | నదులు | చెట్లు | కొండలు | జంతువులు | చెట్లు | ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, అందులో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలెను. -- సంఖ్యాకాండము 13:20.

వేగుల వారు దేనిని కోసికొని దానికి గడకట్టి ఇద్దరు మనుష్యులు మోసుకొని వచ్చిరి? | అంజూరపు పండ్ల గెల | ద్రాక్ష గెల | దానిమ్మ పండ్ల గెల | ఖర్జూరపు గెల | ద్రాక్ష గెల | అక్కడ ఒక్క గెలగల ద్రాక్షపండ్ల తీగెను కోసి, దానికి గడకట్టి ఇద్దరు మనుష్యులు మోసిరి. -- సంఖ్యాకాండము 13:23.

ఆ స్థలమునకు "ఎష్కోలు లోయ" అని పేరు ఎందుకు వచ్చింది? | అక్కడ నీటి ఊట ఉన్నందున | అక్కడ వారు ద్రాక్షగెలను కోసినందున | అది లోతైన లోయ గనుక | అక్కడ యుద్ధం జరిగినందున | అక్కడ వారు ద్రాక్షగెలను కోసినందున | ఇశ్రాయేలీయులు అక్కడ ఆ గెలను కోసినందున ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టబడెను. -- సంఖ్యాకాండము 13:24.

వారు దేశమును సంచరించి చూచుట ఎన్ని దినములకు ముగించిరి? | 7 దినములకు | 40 దినములకు | 30 దినములకు | 12 దినములకు | 40 దినములకు | నలువది దినములైన తరువాత వారు ఆ దేశమును సంచరించి చూచుట ముగించి తిరిగి వచ్చిరి. -- సంఖ్యాకాండము 13:25.

వేగుల వారు మోషేకు ఆ దేశపు _____ చూపించిరి. | మ్యాపును | పండ్లను | రాళ్ళను | మట్టిని | పండ్లను | ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. -- సంఖ్యాకాండము 13:26.

ఆ దేశము ఎటువంటి దేశమని వారు చెప్పిరి? | ఎడారి దేశము | పాలు తేనెలు ప్రవహించు దేశము | రాళ్ళతో నిండిన దేశము | నీరు లేని దేశము | పాలు తేనెలు ప్రవహించు దేశము | అది నిజముగా పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవిగో. -- సంఖ్యాకాండము 13:27.

అయితే ఆ దేశములో నివసించు జనులు _____. | బలహీనులు | బలవంతులు | కొద్దిమంది | పిరికివారు | బలవంతులు | అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. -- సంఖ్యాకాండము 13:28.

అక్కడి మనుష్యులను చూసి భయపడిన వారు అక్కడ ఎవరిని చూచితిమని చెప్పిరి? | ఐగుప్తీయులను | అనాకీయులను (నెఫీలీయుల సంబంధులను) | ఫిలిష్తీయులను | అమాలేకీయులను | అనాకీయులను (నెఫీలీయుల సంబంధులను) | మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. -- సంఖ్యాకాండము 13:28.

దక్షిణ దిక్కున ఎవరు నివసించుచున్నారు? | హిత్తీయులు | అమాలేకీయులు | యెబూసీయులు | కనానీయులు | అమాలేకీయులు | దక్షిణ దిక్కున అమాలేకీయులు నివసించుచున్నారు. -- సంఖ్యాకాండము 13:29.

కొండ మన్నెములో ఎవరు నివసించుచున్నారు? | హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు | కనానీయులు | ఫిలిష్తీయులు | మిద్యానీయులు | హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు | కొండ మన్నెములో హిత్తీయులును యెబూసీయులును అమోరీయులును నివసించుచున్నారు. -- సంఖ్యాకాండము 13:29.

సముద్రముొద్దను యొర్దాను నది యొద్దను ఎవరు నివసించుచున్నారు? | అమాలేకీయులు | కనానీయులు | అమోరీయులు | అనాకీయులు | కనానీయులు | సముద్రముొద్దను యొర్దాను నది యొద్దను కనానీయులు నివసించుచున్నారు. -- సంఖ్యాకాండము 13:29.

జనుల ఎదుట మోషేను ఊరడించి "మనము నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరచుకొందుము" అని చెప్పినదెవరు? | యెహోషువ | కాలేబు | అహరోను | షమ్మూవ | కాలేబు | కాలేబు మోషే యెదుట జనులను ఊరడించి - మనము నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరచుకొందుము, దానిని జయించుటకు మనకు శక్తి చాలుననెను. -- సంఖ్యాకాండము 13:30.

చెడ్డ సమాచారము తెచ్చిన వారు, "ఆ దేశము తన నివాసులను _____ దేశము" అనిరి. | కాపాడు | భక్షించు | పోషించు | ఆశీర్వదించు | భక్షించు | మేము సంచరించి చూచిన ఆ దేశము తన నివాసులను భక్షించు దేశము. -- సంఖ్యాకాండము 13:32.

చెడ్డ సమాచారము తెచ్చిన వారు తాము ఎవరి వలె ఉన్నామని చెప్పిరి? | చీమల వలె | మిడతల వలె | గొర్రెల వలె | పురుగుల వలె | మిడతల వలె | మా దృష్టికి మేమే మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లనే ఉంటిమి. -- సంఖ్యాకాండము 13:33.

Comments

Popular posts from this blog

Genesis_1