Numbers_17
ప్రతి పితరుల కుటుంబమునకు ఒకటి చొప్పున ప్రధానుల యొద్ద మోషే ఎన్ని కర్రలను తీసుకొనెను? | 7 కర్రలను | 3 కర్రలను | 12 కర్రలను | 10 కర్రలను | 12 కర్రలను | వారి పితరుల కుటుంబములను బట్టి వారి ప్రధానులందరి యొద్ద పన్నెండు కర్రలను తీసుకొనుము. -- సంఖ్యాకాండము 17:2.
లేవి కుటుంబపు కర్ర మీద ఎవరి పేరు వ్రాయవలెను? | మోషే పేరు | అహరోను పేరు | గెర్షోను పేరు | కెహాతు పేరు | అహరోను పేరు | లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెను. -- సంఖ్యాకాండము 17:3.
ఎవరి కర్ర చిగురించునో ఆ మనుష్యుని దేవుడు _____? | శిక్షించును | ఏర్పరచుకొనెను | రాజుగా చేయును | పంపివేయును | ఏర్పరచుకొనెను | నేను ఎవరిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. -- సంఖ్యాకాండము 17:5.
మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూచినప్పుడు ఏ కర్ర చిగురించి యుండెను? | యూదా కర్ర | లేవీ కుటుంబపుదైన అహరోను కర్ర | ఎఫ్రాయిము కర్ర | రూబేను కర్ర | లేవీ కుటుంబపుదైన అహరోను కర్ర | మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా, లేవీ కుటుంబపుదైన అహరోను కర్ర చిగురించి యుండెను. -- సంఖ్యాకాండము 17:8.
అహరోను కర్ర చిగురించి, పూలు పూసి ఏమి కాచెను? | ద్రాక్ష పండ్లు | అంజూరపు పండ్లు | బాదము పండ్లు | దానిమ్మ పండ్లు | బాదము పండ్లు | అది చిగురించి పూలు పూసి బాదము పండ్లను కాచెను. -- సంఖ్యాకాండము 17:8.
తిరుగుబాటు చేయువారికి ఆనవాలుగా ఉండునట్లు ఆ కర్రను ఎక్కడ భద్రపరచమనెను? | మందసము లోపల | నదీ తీరమున | ప్రజల చేతిలో | సాక్ష్యపు మందసము ఎదుట | సాక్ష్యపు మందసము ఎదుట | అప్పుడు యెహోవా - తిరుగుబాటు చేయువారికి ఆనవాలుగా ఉండునట్లు... ఆ కర్రను మరల సాక్ష్యపు మందసము ఎదుట ఉంచుమని మోషేతో చెప్పెను. -- సంఖ్యాకాండము 17:10.
ఇశ్రాయేలీయులు మోషేతో, "మేము చస్తున్నాము, మేమందరము _____" అనిరి. | వెళ్ళిపోతున్నాము | నశించిపోతున్నాము | నిద్రపోతున్నాము | భయపడుతున్నాము | నశించిపోతున్నాము | ఇదిగో మేము చస్తున్నాము, నశించిపోతున్నాము, మేమందరము నశించిపోతున్నాము. -- సంఖ్యాకాండము 17:12.
Comments
Post a Comment