Numbers_3
అహరోను కుమారుల పేర్లు ఏవి? | గెర్షోను, కెహాతు, మెరారి | నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామరు | మోషే, అహరోను, మిర్యాము | కోరహు, దాతాను, అబీరాము | నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామరు | అహరోను కుమారులు నలుగురు: తొలిచూలు కుమారుడు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామరు. -- సంఖ్యాకాండము 3:2.
అన్యుని అగ్నిని అర్పించినందున యెహోవా సన్నిధిని చనిపోయిన అహరోను కుమారులు ఎవరు? | ఎలియాజరు, ఈతామరు | హొఫ్నీ, ఫీనెహాసు | నాదాబు, అబీహు | అహరోను, మోషే | నాదాబు, అబీహు | యెహోవా సన్నిధికి అన్యుని అగ్నిని తెచ్చినప్పుడు నాదాబు అబీహులు చనిపోయిరి. -- సంఖ్యాకాండము 3:4.
తొలిచూలు పిల్లలందరికి ప్రతిగా దేవుడు ఎవరిని ఏర్పరచుకొనెను? | యాజకులను | లేవీయులను | ప్రవక్తలను | రాజులను | లేవీయులను | ఇశ్రాయేలీయులలో ప్రతి తొలిచూలు వానికి ప్రతిగా నేను లేవీయులను తీసికొనియున్నాను అని దేవుడు చెప్పెను. -- సంఖ్యాకాండము 3:12.
లేవీయులను ఎన్నో ఏట నుండి పైబడిన వారిని లెక్కించవలెను? | 20 ఏండ్లు మొదలుకొని | 30 ఏండ్లు మొదలుకొని | 50 ఏండ్లు మొదలుకొని | ఒక నెల మొదలుకొని | ఒక నెల మొదలుకొని | ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారినందరిని లెక్కించుమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించెను. -- సంఖ్యాకాండము 3:15.
లేవి కుమారుల పేర్లు ఏవి? | నాదాబు, అబీహు | మోషే, అహరోను | గెర్షోను, కెహాతు, మెరారి | రూబేను, షిమ్యోను | గెర్షోను, కెహాతు, మెరారి | లేవి కుమారులు ముగ్గురు: గెర్షోను, కెహాతు, మెరారి. -- సంఖ్యాకాండము 3:17.
గెర్షోనీయులు మందిరమునకు ఏ దిక్కున దిగవలెను? | తూర్పు దిక్కున | పడమటి దిక్కున | ఉత్తర దిక్కున | దక్షిణ దిక్కున | పడమటి దిక్కున | మందిరమునకు వెనుక తట్టున, అనగా పడమటి దిక్కున గెర్షోనీయుల కుటుంబములు దిగవలెను. -- సంఖ్యాకాండము 3:23.
మందసమును, బల్లని, దీపవృక్షమును కాపాడవలసిన వారు ఎవరు? | గెర్షోనీయులు | కెహాతీయులు | మెరారీయులు | యాజకులు | కెహాతీయులు | పరిశుద్ధ స్థలములోని ఉపకరణములైన మందసము, బల్ల, దీపవృక్షము మొదలగువాటిని కాపాడు బాధ్యత కెహాతీయులది. -- సంఖ్యాకాండము 3:31.
లేవీయుల మొత్తం సంఖ్య ఎంత? | 22,273 | 23,000 | 22,000 | 20,000 | 22,000 | ఒక నెల మొదలుకొని పైప్రాయము గల లేవీయులందరి మొత్తము ఇరవై రెండు వేల మంది. -- సంఖ్యాకాండము 3:39.
ఇశ్రాయేలీయుల తొలిచూలు వారి సంఖ్య లేవీయుల సంఖ్య కంటే ఎంత ఎక్కువ ఉంది? | 200 | 273 | 300 | 222 | 273 | ఇశ్రాయేలీయుల తొలిచూలు వారు లేవీయుల కంటే 273 మంది ఎక్కువగా ఉండిరి. -- సంఖ్యాకాండము 3:46.
మిగిలిన 273 మందికి విమోచన క్రయధనముగా ఒక్కొక్కరికి ఎన్ని తులములు తీసుకొనవలెను? | 10 తులములు | 5 తులములు | 2 తులములు | 1 తులము | 5 తులములు | మిగిలిన వారి విమోచన కొరకు తల ఒకటింటికి ఐదు తులముల చొప్పున తీసుకొనవలెను. -- సంఖ్యాకాండము 3:47.
Comments
Post a Comment