Numbers_31
ఇశ్రాయేలీయుల నిమిత్తము ఎవరి మీద పగ తీర్చుకొనవలెనని దేవుడు మోషేతో చెప్పెను? | మోయాబీయుల మీద | అమాలేకీయుల మీద | మిద్యానీయుల మీద | ఐగుప్తీయుల మీద | మిద్యానీయుల మీద | ఇశ్రాయేలీయుల నిమిత్తము మిద్యానీయుల మీద పగ తీర్చుకొనుము; తరువాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడెదవు. -- సంఖ్యాకాండము 31:2.
యుద్ధమునకు ప్రతి గోత్రము నుండి ఎంతమంది చొప్పున పంపవలెను? | 100 మంది | 10,000 మంది | 1,000 మంది | 500 మంది | 1,000 మంది | ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ప్రతి గోత్రమునకు వెయ్యిమంది చొప్పున ఆ యుద్ధమునకు పంపవలెను. -- సంఖ్యాకాండము 31:4.
యుద్ధమునకు వెళ్ళిన వారి చేతికి వేటిని ఇచ్చి పంపిరి? | పరిశుద్ధమైన ఉపకరణములను, ఊదుటకు బూరలను | మందసమును | అహరోను కర్రను | బలిపీఠమును | పరిశుద్ధమైన ఉపకరణములను, ఊదుటకు బూరలను | మోషే... పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను వారి చేతికిచ్చి పంపెను. -- సంఖ్యాకాండము 31:6.
వారు మిద్యాను రాజులతో పాటు ఇంకా ఎవరిని చంపిరి? | బాలాకును | బిలామును | సీహోనును | ఓగును | బిలామును | వారు చంపిన వారిలో బెయోరు కుమారుడైన బిలామును కత్తితో చంపిరి. -- సంఖ్యాకాండము 31:8.
సేనాధిపతులు స్త్రీలను బ్రతుకనిచ్చినందుకు మోషే ఎందుకు కోపపడెను? | వారు అన్యులు గనుక | వారు ఇశ్రాయేలీయులు పాపము చేయుటకు కారకులైనందున | వారు బలహీనులు గనుక | ఆహారం లేనందున | వారు ఇశ్రాయేలీయులు పాపము చేయుటకు కారకులైనందున | ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయములో ఇశ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరే గదా. -- సంఖ్యాకాండము 31:16.
యుద్ధమునకు వెళ్ళిన వారు పాళెములోనికి రాకముందు ఎన్ని దినములు పాళెము వెలుపల ఉండవలెను? | మూడు దినములు | పది దినములు | ఏడు దినములు | ఒక దినము | ఏడు దినములు | మీరు ఏడు దినములు పాళెము వెలుపల ఉండుడి. -- సంఖ్యాకాండము 31:19.
అగ్నిలో నిలువగల ప్రతి వస్తువును దేని గుండా తీసికొని రావలెను? | నీళ్ల గుండా | అగ్ని గుండా | గాలి గుండా | మట్టి గుండా | అగ్ని గుండా | అగ్నిలో నిలువగల ప్రతి వస్తువును అగ్ని గుండా తీసికొని రావలెను, అప్పుడు అది పవిత్రము అగును. -- సంఖ్యాకాండము 31:23.
యుద్ధమునకు వెళ్ళిన సైనికులు తమకు దొరికిన కొల్లసొమ్మును ఎవరితో పంచుకొనవలెను? | యాజకులతో | సర్వసమాజముతో (ప్రజలతో) | రాజుతో | పేదలతో | సర్వసమాజముతో (ప్రజలతో) | ఆ కొల్లసొమ్మును యుద్ధమునకు వెళ్ళిన యోధులకును సర్వసమాజమునకును సగము సగముగా పంచిపెట్టుము. -- సంఖ్యాకాండము 31:27.
యుద్ధమునకు వెళ్ళిన సైనికులలో "మాలో _____ లేదు" అని మోషేతో చెప్పిరి. | ధైర్యం | ఒక్కడును తక్కువ కాలేదు | ఆయుధాలు | బలం | ఒక్కడును తక్కువ కాలేదు | మాలో ఒక్కడును తక్కువ కాలేదు. -- సంఖ్యాకాండము 31:49.
సైనికులు యెహోవాకు అర్పణగా ఏమి తెచ్చిరి? | వెండిని | పట్టు వస్త్రములను | బంగారు వస్తువులను | పశువులను | బంగారు వస్తువులను | కాబట్టి మాలో ప్రతివానికి దొరికిన బంగారు వస్తువులను... యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై యెహోవాకు అర్పణగా తెచ్చియున్నామనిరి. -- సంఖ్యాకాండము 31:50.
Comments
Post a Comment