Numbers_6

ఒక పురుషుడు గాని స్త్రీ గాని దేవునికి ప్రత్యేకించుకొనునట్లు ఏ మ్రొక్కుబడి చేసికొనవచ్చును? | దహనబలి మ్రొక్కుబడి | నాజీరు మ్రొక్కుబడి | సమాధాన బలి | దశమభాగ మ్రొక్కుబడి | నాజీరు మ్రొక్కుబడి | పురుషుడైనను స్త్రీయైనను నాజీరు మ్రొక్కుబడి చేసికొని యెహోవాకు తమనుతాము ప్రత్యేకించుకొనవచ్చును. -- సంఖ్యాకాండము 6:2.

నాజీరు మ్రొక్కుబడి చేసికొన్నవాడు దేనిని వర్జించవలెను? | మాంసమును | రొట్టెను | ద్రాక్షారసమును, మద్యమును | తేనెను | ద్రాక్షారసమును, మద్యమును | అతడు ద్రాక్షారసమును మద్యమును వర్జించవలెను; ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగకూడదు. -- సంఖ్యాకాండము 6:3.

నాజీరుగా ఉన్న దినములన్నియు అతని తల మీద ఏమి వేయకూడదు? | నూనె | కిరీటము | మంగళకత్తి | టోపీ | మంగళకత్తి | అతడు మ్రొక్కుకొనిన దినములన్నియు మంగళకత్తి అతని తలమీద వేయకూడదు; అతడు యెహోవాకు తన్నుతాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై ఉండును. -- సంఖ్యాకాండము 6:5.

నాజీరుగా ఉన్నప్పుడు ఎవరి యొద్దకు పోకూడదు? | అన్యుల యొద్దకు | శవము యొద్దకు | రాజు యొద్దకు | కుష్ఠరోగి యొద్దకు | శవము యొద్దకు | అతడు యెహోవాకు ప్రత్యేకించుకొనిన దినములన్నియు ఏ శవమునొద్దకు పోకూడదు. -- సంఖ్యాకాండము 6:6.

యాజకులు ఇశ్రాయేలీయులను దీవించునప్పుడు "యెహోవా నిన్ను ఆశీర్వదించి _____" అని చెప్పవలెను? | నీకు ఐశ్వర్యము ఇచ్చును గాక | నిన్ను గొప్ప చేయును గాక | నిన్ను కాపాడును గాక | నీకు జయము ఇచ్చును గాక | నిన్ను కాపాడును గాక | అహరోనును అతని కుమారులును ఇశ్రాయేలీయులను ఈలాగు దీవించవలెను: యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. -- సంఖ్యాకాండము 6:24.

Comments

Popular posts from this blog

Genesis_1